Bitter is better

మనం ఎక్కువగా తీపి, పులుపు, ఉప్పు, కారం లాంటి రుచులకు అధిక ప్రాధాన్యత ఇస్తాము.చిన్న నాటి నుండి మనకు పెద్దలు తియ్యని వే ఎక్కువగా పరిచయం

Friday, 3 May 2019

స్థూలకాయానికి ముఖ్యం గా 5 కారణాలు

1. ఆహారం  

A  అతిగా తినడం , ఆహారం మీద నియంత్రణ లేక పోవడం
B. సమయపాలన లేకపోవడం, రాత్రి వేళల్లో కూడా 
C. కొవ్వు పదార్ధాలు నియంత్రించడం. కొవ్వు ఉన్న ఆహారం తింటే లావు అవుతారన్న అపొహ తో అసలు కొవ్వు ఉన్న ఆహారం మానివేయడం
D. చెక్కెర, చాకోలెట్స్  లాంటివి ఎక్కువ తినడం
E. రక రకాల ఆహారాలు అందుబాటులో ఉండడం
F. శీతల పానీయాలు, చెక్కెర ఉన్న పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోవడం
G. రెడీమేడ్ ఫుడ్ తక్కువ ధరకే దొరకడం 



2.  హార్మోన్సు   

A. మన పాంక్రియాస్ తక్కువ  ఇన్సులిన్ఉ త్పత్తి చేయడం
B.  శరీరం లో పేరుకు పోయిన కొవ్వు లోని లెప్టిన్ ఇంకా తినమని ప్రోత్సహించడం
C.  ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ పెరగడం
D.  ఎదుగుదల ఐన తర్వాత గ్రోత్ హార్మోన్ ఎక్కువ కావడం
E.  ఒత్తిడి అధికమై కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువ కావడం
F.  థైరాక్సిన్ సమతుల్యత లేకపోవడం 


3. జన్యు కారణాలు  

జన్యువుల పరంగా మానవ దేహం 3 రకాలు గా  ఉంటుంది
A. Ectomorphic.  ఈ దేహం ఉన్న వారు సన్నగా ఉంటారు.  వీరు లావు అంత  త్వరగా కారు. 
B. Mesomorphic . వీరు అంత లావు సన్నం కాని మధ్యస్తం గా  ఉంటారు. వీరు ఫై వారికన్నా త్వరగా లావు అవుతారు
C. Endomorphic. వీరు పుట్టుక తో నే లావు గా ఉంటారు.  కొంచెం తినగానే లావు అయిపోతుంటారు 



4. వ్యాయామం 

A. అస్సలు  వ్యాయామమే చేయక పోవడం.
B. పని లో శ్రమ లేక పోవడం పూర్వం చాలా పనులు శ్రమ తో  కూడుకొని ఉండేవి . కానీ ఇప్పుడు సుమారు గా అన్ని పనులు సులభం అయిపోయాయి.
C. నడవడం తగ్గి వాహనం వినియోగం  పెరగడం.



5. నిద్ర 

A . నిద్ర చాలక పోవడం. గత 3 దశబ్దాలు గా నిద్ర సుమారు గా గంటన్నర  తగ్గింది.
B.  పని  లో ఒత్తిడి  పెరిగింది. అది శరీరం మీద ప్రభావం చూపుతోంది.
C.  నిద్ర వేళలు మారడం తో శరీర జీవ గడియారం  మారుతోంది. 

0 comments:

Post a Comment